హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్

PLD: వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజాదర్బార్ నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను నేరుగా విన్న చీఫ్ విప్, సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.