PLD: కూటమి ప్రభుత్వంలో వైసీపీ సానుభూతిపరులపై వేధింపులు ఆపాలని వైసీపీ PAC సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. వినుకొండలో పార్టీ కార్యాలయంలో బాధిత రైతులు, మహిళలను కలిసిన ఆయన, వైసీపీకి మద్దతు ఉందనే కారణంతో టీడీపీ నాయకులు వేధిస్తున్నారని ఆరోపించారు. 'రాజకీయ కక్షలతో ప్రజలను భయపెడితే సహించబోం. ప్రజల తరపున పోరాడతాం' అని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'మద్దతుదారులపై వేధింపులు ఆపండి'


