హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త ఓటర్లకు గుడ్‌న్యూస్'

ELR: ఉంగుటూరు మండలంలోని 77 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వై. సన్యాసిరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని చెప్పారు. 01.10.2026 నాటికి 18 ఏళ్లు నిండే వారు కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.