హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రశాంతంగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్'

NTR: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు శుక్రవారం విజయవాడలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ చేశారు. తొలిరోజు పేపర్-1 ఎస్సే పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రంలో 124 మంది అభ్యర్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.