హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి కళ్యాణంలో కోలాటమాడిన బల్లా పల్లవి

ATP: అనంతపురంలోని తన నివాసంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకలో అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆమె మహిళలతో కలిసి ఉత్సాహంగా కోలాటం ఆడి అలరించారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.