హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు

సత్యసాయి: రామగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మల్లికార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రాప్తాడులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుని కుటుంబానికి ఎస్పీ సతీష్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని, అశ్రునయానాంజలి ఘటించారు.