హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ముమ్మరంగా వాహన తనిఖీలు

ASR: అరకులోయ మండలం యండపల్లివలస టీచర్స్ కాలనీ వద్ద ఎస్సై మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. గంజాయి, నాటుసారా రవాణాను అరికట్టేందుకు వాహనాలను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, డాక్యుమెంట్లు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, ట్రిపుల్‌ రైడింగ్‌పై కేసులు నమోదు చేశారు.