హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

SKLM: ఆమదాలవలస శక్తి టీమ్ ఇంఛార్జ్ టి అమ్మాజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌‌లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శక్తి యాప్‌‌ను డౌన్లోడ్ చేసుకోవడం, సైబర్ భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, చైన్ స్నాచింగ్, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై వివరించారు. అలాగే, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.