హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలకు సొంత భవనం కరువు

KDP: చెన్నూరు మండలం కైలాసగిరి ఎస్టీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 15 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నా, తరగతి గది సౌకర్యం లేదు. స్థానికంగా ఉన్న ఓ గదిలోనే పాఠాలు కొనసాగుతున్నాయి. పాఠశాల భవనం మంజూరు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు చాలాకాలంగా అధికారులను కోరుతున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.