హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి పూజాలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత.!

KRNL: ఆదోని పట్టణంలోని బుడేకల్, కల్లుబావి ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు. భక్తుల ఆహ్వానం మేరకు ముత్యాలమ్మ అవ్వ, ఈడుముక్క తాయమవ్వకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.