హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రముఖ వైద్యులు కన్నుమూత

BPT: చీరాలలో ప్రముఖ వైద్యులు,హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సా నిపుణులు డాక్టర్ డేవిడ్సన్ సాలమన్ మరణించారు. హెచ్ఐవీ బాధితులకు మానసిక ధైర్యాన్ని అందిస్తూ.. సమాజంలో వివక్షను అధిగమించేలా ఆయన విశేష సేవలు అందించారు. వైద్య రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.