NDL: ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని ఈ-ఆటోలు మరమ్మతుల లేమితో నిరుపయోగంగా మారాయి. రూ. లక్షల ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ వాహనాలు షెడ్లకే పరిమితమవగా, వాటిపై అమర్చిన సీసీ కెమెరాలు, విలువైన బ్యాటరీలు కూడా వినియోగం లేక వృథాగా మారుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వాహనాలకు మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వినియోగానికి నోచుకోని ఈ-ఆటోలు


