హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిబందనలు ఉల్లంఘిస్తే పాఠశాలను సీజ్ చేయాలి'

KDP: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినా నారాయణ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. ఎం. ఓబులేసు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎఫ్ నేతలు ప్రత్యేక తరగతులను అడ్డుకున్నారు.