హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వచ్చే నెల 12న అమలాపురంలో లోక్ అదాలత్'

కోనసీమ: అమలాపురం మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 12న అమలాపురం కోర్టు భవనాల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి చంద్రమౌళీశ్వరి తెలిపారు. పెండింగ్లో ఉన్న సివిల్, బ్యాంక్, చెక్ బౌన్స్ కేసులతో పాటు రాజీపడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.