హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు పల్లె నిద్ర కార్యక్రమం'

NTR: తునికిపాడు గ్రామంలో ఈ సాయంత్రం 6 గంటలకు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం, అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టనున్నారు. ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ, మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు, గంపలగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొంటారు.