హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దాడులతో జర్నలిస్టుల కలాన్ని ఆపలేరు'

VZM: పూసపాటిరేగ రిపోర్టర్ గోవింద్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సీపీఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్‌లో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. పూసపాటిరేగలో జరుగుతున్న భూ కబ్జాలు, అక్రమాలపై వరుస కథనాలు రాస్తున్నందుకే గోవింద్‌పై దాడి జరిగిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రమణ, సహాయ కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.