హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆటో డ్రైవర్లకు ఆకలి తిప్పలు..!

KRNL: ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఇప్పుడు నిరాశే నిండిపోతోంది. కోసిగి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణికులను చేర వేసే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఉదయం 6 గంటలకే ఆటోను స్టాండ్‌లో నిలిపి, మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఒక్కరూ రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు వల్ల ప్యాసింజర్లు రావడంలేదని, దీంతో రోజంతా వేచి చూసినా బోణీ కూడా కావడం లేదన్నారు.