హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆగస్టు 26న భారీ రక్తదాన శిబిరం'

NTR: నందిగామలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 26న భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. యం.డి. షేర్ అలీ & బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిభ హైస్కూల్‌లో శిబిరం జరుగుతుంది. రక్తదానం మించిన దానం లేదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.