TPT: భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు TTD ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 4 కాళ్ల క్వాడ్రుపెడ్ రోబో డాగ్ పనితీరును అదనపు EO వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఆప్టికల్, థర్మల్ కెమెరాలు, 360° లైడార్, AI సెన్సర్లతో కూడిన ఈ రోబోట్ చీకటి, పొగమంచులోనూ జంతువులు, మనుషులను గుర్తించగలదు. అడవుల్లో చిరుతల కదలికలను గుర్తించి సిబ్బందికి సమాచారం ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో రోబో డాగ్ పహారా


