WG: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా సబయూనిట్ అధికారి ఎస్.వి.ఎస్.ప్రసాద్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని 6వ వార్డులో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల ఆవరణలో నీరు నిల్వ లేకుండా పొడిగా ఉంచుకోవాలన్నారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందన్నారు. రాత్రివేళ దోమతెరలు వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ'


