హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోదండరామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

W.G: భీమవరం మండలం చిన్న అమిరం కొత్తపేటలోని శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పాటు భక్తులు, దాతలు సహకరిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.