VZM: బొబ్బిలిలో ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 9 గంటలకు కళాభారతి ఆడిటోరియం నుంచి వందలాది మంది కళాకారులు వేషధారణలో ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం 10 గంటల నుంచి వివిధ కళారూపాల ప్రదర్శనలు, సీనియర్, వృద్ధ కళాకారుల సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కళాభారతి ఆధ్వర్యంలో పలు కళా సంస్థలు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
'కళాకారులు వేషధారణలో ర్యాలీ'


