హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శక్తి యాప్‌పై అవగాహన

CTR: మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై కరీమున్నీసా సూచించారు. చిత్తూరు దుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం శక్తి యాప్ ఉపయోగాలను ఆమె వివరించారు. అత్యవసర సమయాలలో మహిళలు, బాలికలు పోలీసుల సహాయాన్ని పొందేందుకు యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. దానిని ఉపయోగించే విధానాన్ని తెలియజేశారు.