హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్టలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి రుసుము లేకుండా పూజా సామగ్రి, పాత్రలను దేవస్థానం సమకూర్చింది. సుమారు 200 మంది మహిళా భక్తులు వ్రతాల్లో పాల్గొని అమ్మవారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.