హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధనలక్ష్మి అలంకరణలో శ్రీ చౌడేశ్వరి దేవి

అన్నమయ్య: మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లె సిల్క్‌టౌన్‌లో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చేలా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.