హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతం

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. రంగమండపంలో సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, పుష్పమాలికలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, రవికలతో కూడిన వాయనం పంపిణీ చేశారు.