అన్నమయ్య: రాయచోటిలో తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని అర్బన్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. సీఐ వెంకట చలపతి ఆదేశాలతో ఎస్సై చండ్రాయుడు గాలింపు చేపట్టి జగనన్న కాలనీలో బాలుడిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలను ప్రేమగా అర్థం చేసుకుని మాట్లాడాలని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల చొరవతో బాలుడు సురక్షితం


