హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలుపు అవకాశాలున్న స్థానాల్లోనే జనసేన పోటీ

AKP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలంగా ఉన్న, గెలుపు అవకాశాలున్న స్థానాల్లోనే పోటీ చేయనున్నట్లు చోడవరం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పీవీఎస్‌ఎన్‌ రాజు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల వివరాలను జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ద్వారా అధిష్టానానికి పంపనున్నట్లు తెలిపారు.