హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి శివారు ప్రాంతాల్లో మురుగు సమస్య

WNP: వనపర్తి పురపాలక పరిధిలో మురుగు సమస్య తీవ్ర రూపం దాల్చింది. నాగవరం శివారు ప్రాంతంలో మరింత దయనీయంగా మారింది. వనపర్తి కొత్తకోట మార్గంలో మురుగు నీటి కాలువలో మురుగునీరు ప్రవాహానికి పైపులు అడ్డంగా వేశారు. దీంతో మురుగునీరు ముందుకు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పురపాలక శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.