హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంటలో చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలి'

MNCL: భీమిని మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో AEO శ్రీనివాస్ పత్తి పంటను శుక్రవారం పరిశీలించారు. పంట ఎదుగుదల, మొక్కల పరిస్థితిని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. పంటలో చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలని, తెగుళ్లు కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు పురుగుమందులు వినియోగించాలని తెలిపారు.