హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యటన అడ్డుకుంటామన్న జనసేన నేతల అరెస్ట్..!

JGL: మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని జనసేన నాయకులు ప్రకటించడంతో జగిత్యాల పట్టణ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి చల్ల శివారెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు బెక్కం జనార్దన్, టౌన్ నాయకులు శ్రీకర్, సంకీర్తన్, ప్రవీణ్, జైపాల్‌రెడ్డి తదితరులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.