హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముస్తాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. స్మార్ట్ కార్డులతో సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు. ఉపసర్పంచ్ విజయ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.