హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్ ముందు ఆయుర్వేద వైద్యుల నిరసన

WGL: స్టైపెండ్ పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యులు శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.