హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హోం మంత్రి నివాసంలో వరలక్ష్మి వ్రతం

AKP: నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని తన నివాసం వద్ద రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం వరలక్ష్మీ దేవి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మీ అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా, సుఖసంతోషాలతో సమృద్ధిగా ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించారు.