E.G: నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండల ఎస్సై ఏ. శ్రీనునాయక్ సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించవచ్చన్నారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అవగాహణ కల్పించాలని కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు: SI


