హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రధాన రహదారిపై చెత్త కంపు!

BPT: చీరాల నుంచి కారంచేడు వెళ్లే ప్రధాన రహదారిలోని లారీ స్టాండ్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం భారీగా పేరుకు పోయింది. ఆ ప్రాంతం డెంపింగ్ యార్డులా మారి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధం వల్ల ఆ మార్గంలో రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.