హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రావణ వరలక్ష్మి వ్రతానికి పోటెత్తిన భక్తుల:

SRCL: శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన మహాలక్ష్మి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి చీర, రవిక, ఒడిబియ్యం, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.