హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాజీపేటలో పోలింగ్ కేంద్రాల తనిఖీ

KDP: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఖాజీపేట ఎంపీడీవో మస్తాన్ తెలిపారు. మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓటర్లకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.