హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్‌ సెర్చ్‌.. 47 వాహనాలపై చర్యలు

GNTR: ఓల్డ్‌ గుంటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇజ్రాయిల్‌పేట, మణిపురం ఫ్లైఓవర్‌ సమీపంలో శుక్రవారం పోలీసులు కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు సక్రమంగా లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు. స్థానికులకు డ్రగ్స్‌, గంజాయి తదితర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.