MDK: పాఠశాలల వద్ద గంజాయి చాక్లెట్ల విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు శోధిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రామాయంపేట ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో బాపనయ్య, మెతుకుల, బాల్య తండాల్లోని బడుల వద్ద డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేశారు. విద్యార్థులను మత్తుకు బానిసలుగా మార్చేందుకు యత్నిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
పాఠశాలల పరిసరాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు


