హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఏసీఏ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే క్రికెట్ లీగ్ పోటీలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.