ELR: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే ధ్యేయంగా చింతలపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు బాధితులు, ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కి విన్నవించుకుని అర్జీలు సమర్పించారు. వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్'


