హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్

NZB: భీమగల్ మండలంలోని బీసీ నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం ప్రారంభమైంది.100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ తెలిపారు.18-55 ఏళ్ల వయస్సు, వైట్ రేషన్ కార్డు, 5వ తరగతి ఉన్నవారు అర్హులని సూచించారు. సెప్టెంబరు 15లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలన్నారు.