హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చినుకు పడితే ఈ రోడ్డుపై ప్రయాణం సాహసమే..!

SKLM: కవిటి మండలం పొందూరుపుట్టుగ గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది. ఈ రోడ్డులో వాహనదారులు ప్రయాణం చేయాలంటే సవాల్ మారుతుంది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దశాబ్దాల కాలంగా ఈ రోడ్డును మరమ్మత్తులు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు.