అన్నమయ్య: అన్నవరం శ్రీసత్యదేవుని దేవస్థానాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సత్యనారాయణ స్వామి సేవలో మంత్రి


