KRNL: కోసిగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో డ్రైనేజీ కాలువలో పేరుకు పోయిన చెత్తా చెదారం, ముళ్ల కంపను జేసీబీ సహాయంతో తొలగించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ముత్తరెడ్డి సమస్యను గుర్తించి వెంటనే స్పందించి, జేసీబీని ఏర్పాటు చేసి శుభ్రత పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా మారి విద్యార్థులు, స్థానికులకు ఇబ్బందులు తొలగాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జేసీబీతో డ్రైనేజీ కాలువ శుభ్రత


