హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీతారామ ఆలయంలో కలశ ప్రతిష్ఠ

KDP: సిద్ధవటం మండలం చాముండేశ్వరి పేట గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ ఆలయంలో శుక్రవారం కలశ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గాలిగోపురంపై పంచలోహ కలశాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.