ATP: గోవా మద్యం అక్రమ రవాణా కేసులో ప్రధాన సూత్రధారి రామాంజనేయరెడ్డితో పాటు లక్ష్మీనారాయణ రెడ్డి, మాధవ్ గుప్తాలను తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. పుట్లూరు మండలం చింతలపల్లెకు చెందిన రామాంజనేయరెడ్డి కర్ణాటక, గోవా, మహారాష్ట్రల నుంచి మద్యం తెచ్చి అక్రమంగా విక్రయిస్తున్నాడు. ఈ నెల 17న లారీలో గోవా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోవా మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్


