హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కండ్లకుంటలో పోలీసులు కార్డాన్‌ సెర్చ్‌

పల్నాడు జిల్లా వెల్దుర్తి(M) కండ్లకుంటలో పోలీసులు కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇళ్లను, పరిసరాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, పాత కేసుల నిందితులపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.