హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటోల బంద్‌ను జయప్రదం చేయాలి'

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలో శుక్రవారం ఆటో కార్మికుల జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆగస్టు 24న చేపట్టనున్న ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ హామీలను తప్పకుండా అమలు చేయాలని కోరారు.